Ezekiel 48:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇది సాదోకు సంతతివారై నాకు ప్రతిష్టింపబడి నేను వారి కప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును; ఏలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లె వారు నన్ను విడిచిపోలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ భూమి సాదోకు సంతతివారికి ఇవ్వ బడుతుంది. ఈ మనుష్యులు నా పవిత్ర యాజకులుగా ఉండటానికి ఎంపిక చేయబడ్డారు. ఎందువల్లనంటే ఇతర ఇశ్రాయేలీయులు నన్ను వదిలిపెట్టినప్పుడు కూడా వీరు నన్ను భక్తి శ్రద్ధలతో కొలిచారు. లేవీయులు చేసినట్లు సాదోకు సంతతి నన్ను విడిచిపెట్టలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇది సాదోకు సంతతివారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారి కప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును; ఏలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లె వారు నన్ను విడిచిపోలేదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇది ప్రతిష్ఠించబడిన యాజకులైన సాదోకు సంతతివారి కోసము. ఇశ్రాయేలీయులు తప్పుదారి పట్టినప్పుడు లేవీయుల్లా తప్పుదారి పట్టకుండా, వారు నాకు సేవచేయడంలో నమ్మకంగా ఉన్నారు.