Ezekiel 48:15 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇరువది యయిదువేల కొలకఱ్ఱల భూమిని ఆను కొని వెడల్పున మిగిలిన అయిదువేల కొలకఱ్ఱలుగల చోటు గ్రామకంఠముగా ఏర్పరచబడినదై, పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకువచ్చును; దాని మధ్య పట్టణము కట్టబడును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యాజకులకు, లేవీయులకు ఇచ్చిన భూమిని ఆనుకొని ఐదువేల మూరల వెడల్పు, ఇరవై ఐదువేల మూరల పొడవు గల ఒక స్థలం ఉంటుంది. ఈ స్థలం నగరానికి, పశువులు తిరిగి మేయటానికి, ఇండ్లు కట్టటానికి ఉపయోగపడుతుంది. సామాన్య ప్రజలు ఈ స్థలాన్ని వినియోగించుకుంటారు. నగరం దీని మధ్యలో వుంటుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇరువదియయిదువేల కొలకఱ్ఱల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన అయిదువేల కొలకఱ్ఱలుగల చోటు గ్రామకంఠముగా ఏర్పరచబడినదై, పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకువచ్చును; దాని మధ్య పట్టణము కట్టబడును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మిగిలిన స్థలం, 5,000 మూరల వెడల్పు 25,000 మూరల పొడవున మిగిలిన భూమిని ఉమ్మడి ప్రాంతంగా భావించి పట్టణంలోని ఇళ్ళ కోసం పచ్చిక బయళ్ల కోసం ఉపయోగించాలి. పట్టణం దాని మధ్యలో ఉంటుంది.