Ezekiel 48:18 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టముచేత జీవించువారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠితభూమిని యానుకొని తూర్పు తట్టున పదివేల కొలకఱ్ఱలును పడమటితట్టున పదివేల కొల కఱ్ఱలును ఉండును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పవిత్ర ప్రదేశం పొడవు ప్రక్కగా వదిలిన స్థలం తూర్పున పదివేల మూరలు, పడమట పదివేల మూరలు. ఈ స్థలం పవిత్ర ప్రదేశం ప్రక్కన పొడవునా ఉంటుంది. నగర కార్మికులకు ఈ స్థలంలో ఆహార ధాన్యాలు పండుతాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టముచేత జీవించువారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠితభూమినియానుకొని తూర్పుతట్టున పదివేల కొలకఱ్ఱలును పడమటితట్టున పదివేల కొల కఱ్ఱలును ఉండును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కేటాయించబడిన పవిత్ర స్థలంతో పాటు మిగిలిన భూమి పొడవు తూర్పు వైపున 10,000 మూరలు పడమర వైపు 10,000 మూరలు ఉంటుంది. ఇది పట్టణంలో పనిచేసి బ్రతికేవారికి ఆహారాన్ని అందించే ఆధారంగా ఉంటుంది.