Ezekiel 48:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ప్రతిష్ఠిత భూమియంతయు ఇరువది యయిదు వేల కొల కఱ్ఱల చచ్చౌకముగా ఉండును; దానిలో నాలుగవ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఈ ప్రత్యేక భూభాగం నలుదిశలా చదరంగా వుంటుంది. దాని పొడవు వెడల్పులు ఒక్కొక్కటి ఇరవై ఐదువేల మూరలు చొప్పున ఉన్నాయి. దాని ప్రత్యేక అవసరాల కొరకే ఈ భూమిని ఉంచాలి. ఒక భాగం యాజకులకు. ఒక భాగం లేవీయులకు. ఒక భాగం నగరానికి చెంది ఉండవలెను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రతిష్ఠిత భూమియంతయు ఇరువదియయిదు వేల కొల కఱ్ఱల చచ్చౌకముగా ఉండును; దానిలో నాలుగవభాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
భాగమంతా చతురస్రాకారంలో ఉంటుంది, ప్రతి వైపు 25,000 మూరలు ఉండాలి. ప్రత్యేక బహుమతిగా మీరు పట్టణం యొక్క ఆస్తితో పాటు పవిత్ర భాగాన్ని ప్రక్కన పెడతారు.