Ezekiel 48:21 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ప్రతిష్ఠితస్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయ బడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని, అనగా తూర్పుదిశను ప్రతిష్ఠితస్థానముగా ఏర్పడిన యిరువది యయిదువేల కొలకఱ్ఱలును పడ మటి దిశను గోత్రస్థాన ములుగా ఏర్పడిన యిరువది యయిదు వేల కొలకఱ్ఱలును గల భూమిని యానుకొనుస్థానము అధిపతిదగును. ప్రతి ష్ఠిత స్థానమును, మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఆ ప్రత్యేక భూమిలో ఒక భాగం దేశపాలకునికి చెందుతుంది. ఆ ప్రత్యేక భూమి నలుదిశలా చదరంగా ఉంది. దాని పొడవు, వెడల్పులు ఒక్కొక్కటి ఇరవై ఐదువేల మూరల చొప్పున ఉన్నాయి. ఈ ప్రత్యేక భూమిలో ఒక భాగం యాజకులకు, ఒక భాగం లేవీయులకు, మరొక భాగం ఆలయానికి చెందుతాయి. ఆలయం ఈ స్థలంలో మధ్యగా వుంటుంది. మిగిలిన భాగం దేశపాలకునికి చెందుతుంది. బెన్యామీనీయుల సరిహద్దుకు, యూదా వారి సరిహద్దుకు మధ్యగావున్న ప్రాంతం రాజ్యాధిపతికి చెంది ఉంటుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రతిష్ఠితస్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని, అనగా తూర్పుదిశను ప్రతిష్ఠితస్థానముగా ఏర్పడిన యిరువది యయిదువేల కొలకఱ్ఱలును పడమటి దిశను గోత్రస్థానములుగా ఏర్పడిన యిరువదియయిదు వేల కొలకఱ్ఱలునుగల భూమినియానుకొనుస్థానము అధిపతిదగును. ప్రతిష్ఠిత స్థానమును, మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“పవిత్ర కేటాయింపు, పట్టణం యొక్క ఆస్తికి రెండు వైపులా మిగిలి ఉన్నవి యువరాజుకు చెందుతాయి. ఇది పవిత్ర భాగపు 25,000 మూరల నుండి తూర్పు సరిహద్దు వరకు పశ్చిమాన 25,000 మూరల నుండి పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించి ఉంటుంది. గిరిజన ప్రాంతాల పొడవునా ఈ రెండు ప్రాంతాలు యువరాజుకు చెందుతాయి ఆలయ పరిశుద్ధ స్థలంతో కూడిన పవిత్ర భాగం వాటి మధ్యలో ఉంటుంది.