Ezekiel 48:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యూదావారి సరిహద్దును అనుకొని తూర్పు పడమర లుగా మీరు ప్రతిష్టించు ప్రతిష్టిత భూమియుండును. దాని వెడల్పు ఇరువదియైదు వేల కొలకఱ్ఱలు; దాని నిడివి తూర్పునుండి పడమరవరకు తక్కినభాగముల నిడివి వలెనే యుండును; పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మిగిలిన భూభాగం ప్రత్యేక వినియోగాలకు కేటాయించ బడింది. మిగిలిన భాగం యూదా యొక్క భాగానికి దక్షిణాన ఉంది. ఈ ప్రదేశం ఉత్తరాన ఇరవై ఐదువేల మూరల పొడఉంది. మరియు పడమట పది వేల మూరల వెడల్పు, తూర్పున పదివేల మూరల వెడల్పు, దక్షిణాన ఇరవై ఐదువేల మూరల వెడల్పు ఉంటుంది. ఆలయం ఈ విభాగం మధ్యలోవుంటుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యూదావారి సరిహద్దును అనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమియుండును. దాని వెడల్పు ఇరువదియైదు వేల కొలకఱ్ఱలు; దాని నిడివి తూర్పునుండి పడమరవరకు తక్కిన భాగముల నిడివి వలెనే యుండును; పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“తూర్పు నుండి పడమర వరకు యూదా భూభాగానికి సరిహద్దుగా ఉండే భాగాన్ని మీరు ప్రత్యేక బహుమతిగా సమర్పించాలి. అది 25,000 మూరల వెడల్పు, దాని పొడవు తూర్పు నుండి పడమర వరకు ఉన్న గోత్రాల భాగాలలో ఒక దానితో సమానము.