Ezekiel 6:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగానీ చేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములనుబట్టి అయ్యో అని అంగలార్చుము; ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారు కూలు దురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మళ్లీ నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: “నీ చేతులు చరిచి, నీ పాదాలను దట్టించుము. ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఘోరమైన చెడ్డ పనులన్నిటినీ విమర్శిస్తూ మాట్లాడు. వారు వ్యాధుల వల్ల, ఆకలిచేత చనిపోతారని వారిని హెచ్చరించు. వారు యుద్ధంలో చనిపోతారని తెలియజేయుము.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా — నీచేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములనుబట్టి అయ్యో అని అంగలార్చుము; ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారు కూలుదురు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: మీ చేతులను చరిచి మీ పాదాలతో నేలను తన్ని ఇశ్రాయేలు ప్రజల దుర్మార్గమైన అసహ్యమైన క్రియలనుబట్టి “అయ్యో!” అని ఏడువు ఎందుకంటే వారు ఖడ్గం కరువు తెగులు ద్వారా చస్తారు.