Ezekiel 6:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
దూరముననున్న వారు తెగులుచేత చత్తురు, దగ్గర నున్నవారు ఖడ్గముచేత కూలుదురు, శేషించి ముట్టడి వేయబడినవారు క్షామముచేత చత్తురు; ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దూరాన వున్నవారు రోగపీడితులై చనిపోతారు. ఈ ప్రదేశానికి దగ్గరగా వున్న ప్రజలు కత్తిచేత చంపబడతారు. ఇంకను నగరంలో మిగిలిన ప్రజలు ఆకలితో మాడి చనిపోతారు. అప్పుడు మాత్రమే నా కోపం తగ్గుతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దూరముననున్నవారు తెగులుచేత చత్తురు, దగ్గర నున్నవారు ఖడ్గముచేత కూలుదురు, శేషించి ముట్టడి వేయబడినవారు క్షామముచేత చత్తురు; ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దూరాన ఉన్నవారు తెగులు వచ్చి చస్తారు. దగ్గరగా ఉన్నవారు ఖడ్గంతో చస్తారు, ఎవరైనా మిగిలినా, విడిచిపెట్టబడినా, వారు కరువుతో చస్తారు. నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను.