Ezekiel 7:27 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
రాజు వ్యాకులపడు చున్నాడు, అధికారులు భీతినొందుచున్నారు, సామాన్య జనులు వణకుచున్నారు; నేను యెహోవానై యున్నా నని వారు తెలిసికొనునట్లు వారి ప్రవర్తనఫలము నేను వారి మీదికి రప్పింపబోవుచున్నాను, వారు చేసిన దోషము లను బట్టి వారికి తీర్పు తీర్చబోవుచున్నాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
చనిపోయిన ప్రజల కొరకు మీ రాజు దుఃఖిస్తాడు. నాయకులు విషాద సూచక దుస్తులు ధరిస్తారు. సామాన్య జనులు మిక్కిలి భయపడతారు. ఎందువల్లనంటే వారు చేసిన పనులను నేను తిప్పికొడతాను. నేను వారికి శిక్షను నిర్ణయిస్తాను. వారిని నేను శిక్షిస్తాను. అప్పుడా ప్రజలు నేను యెహోవానని తెలుసుకుంటారు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజు వ్యాకులపడుచున్నాడు, అధికారులు భీతినొందుచున్నారు, సామాన్య జనులు వణకుచున్నారు; నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు వారి ప్రవర్తనఫలము నేను వారి మీదికి రప్పింపబోవుచున్నాను, వారు చేసిన దోషములనుబట్టి వారికి తీర్పు తీర్చబోవుచున్నాను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజు దుఃఖిస్తారు, యువరాజు నిరాశకు గురవుతాడు, దేశ ప్రజల చేతులు వణకుతాయి. వారి ప్రవర్తనను బట్టి వారికి చేస్తాను, వారి సొంత ప్రమాణాల ప్రకారమే నేను వారికి తీర్పు తీరుస్తాను. “ ‘అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”