Ezekiel 9:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెనుమీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను కనికరమైనను లేకుండ అందరిని హతము చేయుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మళ్లీ దేవుడు ఇతర ఐదుగురు మనుష్యులతో, “మీరు ఆ మొదటి వ్యక్తిని అనుసరించి వెళ్లవలసిందిగా మిమ్ముల్ని కోరుతున్నాను. నుదుటి మీద గుర్తులేని ప్రతివానిని మీరు చంపివేయండి. వారు పెద్దలేగాని, పిన్నలేగాని, యువతులేగాని, పిల్లలేగాని, తల్లులేగాని ఎవరైనా లెక్కచేయవద్దు. మీ ఆయుధాన్ని వినియోగించి నుదుటిపై గుర్తులేని ప్రతివానిని చంపివేయండి. ఏ మాత్రం దయాదాక్షిణ్యం చూపవద్దు. ఎవ్వరిపట్లా జాలిపడవద్దు! ఈ నా ఆలయం వద్దనే మొదలు పెట్టండి” అని చెప్పాడు. ఆలయం ముందు ఉన్న పెద్దలతోనే వారు మొదలు పెట్టారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెను–మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధస్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను కనికరమైననులేకుండ అందరిని హతము చేయుడి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను వింటుండగా ఆయన మిగిలిన వారితో, “మీరు అతని వెంట పట్టణంలోనికి వెళ్లి దయా కనికరం లేకుండా అందరిని చంపండి.