Ezekiel 9:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నేను తప్ప మరి ఎవరును శేషింప కుండ వారు హతము చేయుట నేను చూచి సాస్టాంగపడి వేడుకొని అయ్యో, ప్రభువా, యెహోవా, యెరూష లేముమీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించినవారినందరిని నశింపజేయుదువా? అని మొఱ్ఱ పెట్టగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ మనుష్యులు ప్రజలను చంపటానికి వెళ్లగా, నేను అక్కడే ఉండిపోయాను. నా శిరస్సును భూమికి ఆనించి నమస్కరించి, “నా ప్రభువైన ఓ యెహోవా, యెరూషలేముపై నీ కోపాన్ని ప్రకటించటంతో నీవు ఇశ్రాయేలులో మిగిలి ఉన్న వారిని చంపివేయటం లేదు కదా!” అని అన్నాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను తప్ప మరి ఎవరును శేషింపకుండ వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి వేడుకొని–అయ్యో, ప్రభువా, యెహోవా, యెరూషలేముమీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలీయులలో శేషించినవారినందరిని నశింపజేయుదువా? అని మొఱ్ఱపెట్టగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు చంపుతూ ఉన్నప్పుడు నేను ఒక్కడినే మిగిలి పోయాను, అప్పుడు నేను నేలపై పడి గట్టిగా ఏడుస్తూ, “అయ్యో! ప్రభువైన యెహోవా! యెరూషలేముపై నీ ఉగ్రతను కుమ్మరించి ఇశ్రాయేలీయులలో మిగిలి ఉన్నవారందరిని నాశనం చేస్తావా?” అని మొరపెట్టాను.