Ezra 4:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు పారసీకదేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోను పారసీకదేశపు రాజైన దర్యా వేషుయొక్క పరిపాలనకాలమువరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వాళ్లు ప్రభుత్వాధికారులకు లంచాలిచ్చి, వాళ్లు యూదా ప్రజలకు వ్యతిరేకంగా పని చేసేలా చూశారు. ఆ అధికారులు యూదుల దేవాలయ నిర్మాణ పథకాలను భగ్నం చేసేందుకు నిరంతరం కృషిచేశారు. కోరెషు పారశీక రాజుగా వున్నకాలంలో దర్యావేషు పారశీక రాజు అయ్యేంత వరకూ వాళ్ల యీ ప్రయత్నం కొనసాగింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు పారసీకదేశపు రాజైన కోరెషుయొక్క దినములన్నిటిలోను పారసీకదేశపు రాజైన దర్యావేషుయొక్క పరిపాలనకాలమువరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పర్షియా రాజైన కోరెషు పరిపాలించిన కాలం నుండి పర్షియా రాజైన దర్యావేషు పరిపాలించిన కాలం వరకు యూదా వారి ప్రణాళికలను చెడగొట్టడానికి వారు అధికారులకు లంచాలు ఇచ్చారు.