Ezra 6:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కావున చెరలో నుండి విడుదలనొంది తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రతనుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరును వచ్చి, తిని పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆనంద ముతో ఆచరించిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అలాగు, నిర్బంధంనుంచి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులందరూ పస్కా పండుగ భోజనం చేశారు. ఇతరులు స్నానాదులతో తమని తాము శుభ్రం చేసుకుని, ఆ దేశంలో నివసించే ఇతర మనుష్యుల అపరిశుభ్ర అంశాలనుంచి తమని తాము వేరు చేసుకున్నారు. అలా పరిశుద్ధులైన వాళ్లు కూడా పస్కా పండుగ భోజనంలో పాల్గొన్నారు. వాళ్లు సహాయం కోసం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దగ్గరకు పోగలిగేందుకు, వారు తమ్మును తాము వేరు చేసుకొని పరిశుద్ధ పరచుకొన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కావున చెరలోనుండి విడుదలనొంది తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులును, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రతనుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరును వచ్చి,తిని పులియనిరొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆచరించిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
చెర నుండి విడుదలై వచ్చిన ఇశ్రాయేలీయులు, దేశంలో పొరుగు ప్రజల అపవిత్ర ప్రవర్తను నుండి తమను తాము ప్రత్యేకించుకొని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను కొలిచే వారంతా కలిసి పస్కాను తిన్నారు.