Ezra 8:29 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో, యాజకులయొక్కయు లేవీయుల యొక్కయు ఇశ్రాయేలు పెద్దలయొక్కయు ప్రధానులైన వారి యెదుట, వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందుకని, మీరీ వస్తువులను జాగ్రత్తగా కాపాడండి. యెరూషలేములోని దేవాలయ పెద్దలకు మీరు వీటిని అప్పగించేదాకా, యీ వస్తువులకు మీరే బాధ్యులు. మీరు వీటిని ముఖ్య లేవీయులకి, ఇశ్రాయేలు కుటుంబ పెద్దలకీ యిచ్చినప్పుడు వాళ్లు వీటిని తూకం వేసి, యెరూషలేములోని యెహోవా దేవాలయంలోని గదుల్లో పదిలపరుస్తారు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో, యాజకులయొక్కయు లేవీయులయొక్కయు ఇశ్రాయేలు పెద్దలయొక్కయు ప్రధానులైన వారియెదుట, వాటిని తూచి అప్పగించువరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదుల్లో ముఖ్య యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలీయుల కుటుంబ పెద్దల సమక్షంలో వీటిని తూచి అప్పగించే వరకు వీటిని జాగ్రత్తగా కాపాడండి” అని చెప్పాను.