Genesis 18:25 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతి మంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టు నితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ పట్టణాన్ని నీవు అసలు నాశనం చేయనే చేయవు. చెడ్డవాళ్లను చంపడంకోసం 50 మంది మంచివాళ్లను నీవు నాశనం చేయవు. అలా గనుక జరిగితే మంచివాళ్లు చెడ్డవాళ్లు సమానమై, ఇద్దరూ శిక్షించబడుతారు. భూలోకమంతటికి నీవు న్యాయమూర్తివి. నిజంగా నీవు సరైనదే చేస్తావని నాకు తెలుసు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ చొప్పున చేసి దుష్టులతోకూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అలా నాశనం చేయడం మీకు దూరమవును గాక! దుష్టులతో పాటు నీతిమంతులను చంపడం, దుష్టులను నీతిమంతులను ఒకేలా చూడడము. మీ నుండి ఆ తలంపు దూరమవును గాక! సర్వలోక న్యాయాధిపతి న్యాయం చేయరా?” అని అన్నాడు.