Genesis 19:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడ నైయున్న తన అల్లుళ్లతో మాటలాడిలెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవు చున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్లదృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనుక లోతు బయటకు వెళ్లి, తన కుమార్తెలను పెళ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాట్లాడాడు. “త్వరగా ఈ పట్టణం వదిలిపెట్టిండి. యెహోవా దీన్ని త్వరగా నాశనం చేస్తాడు” అని లోతు అన్నాడు. అయితే లోతు పరిహాసం చేస్తున్నాడనుకొన్నారు వాళ్లు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాటలాడి–లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్లదృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెళ్ళి చేసుకోబోయే తన అల్లుళ్ళతో మాట్లాడి, “త్వరపడండి, ఈ స్థలాన్ని విడిచిపెట్టి రండి, యెహోవా దీనిని నాశనం చేయబోతున్నారు” అని అన్నాడు. అయితే వారికి తన మాటలు హేళనగా అనిపించాయి.