Genesis 19:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారుఆలాగు కాదు, నడివీధిలో రాత్రి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లోతు ఇలా అన్నాడు: “అయ్యలారా, దయతో నా ఇంటికి రండి, నేను మీకు సేవ చేస్తాను. అక్కడ మీరు మీ కాళ్లు కడుక్కొని, రాత్రి బస చేయవచ్చును. ఆ తరువాత మీరు మీ ప్రయాణం కొనసాగించవచ్చు.” “లేదు. ఈ రాత్రికి మేము ఈ ఖాళీ స్థలంలో బస చేస్తాం” అన్నారు దేవదూతలు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్లవచ్చుననెను. అందుకు వారు–ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నా ప్రభువులారా! దయచేసి మీ దాసుని ఇంటికి రండి, మీ కాళ్లు కడుక్కుని ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి, వేకువజామున లేచి వెళ్లవచ్చు” అని వారితో అన్నాడు. అప్పుడు వారు, “లేదు, ఈ రాత్రి నడి వీధిలోనే ఉంటాం” అని చెప్పారు.