Genesis 19:34 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరునాడు అక్క తన చెల్లెలిని చూచినిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయ నించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలా గున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మర్నాడు పెద్దమ్మాయి చిన్నమ్మాయితో చెప్పింది: “గత రాత్రి నా తండ్రితో నేను పండుకొన్నాను. ఈ రాత్రి మళ్లీ మనం ఆయనకు ద్రాక్షారసముతో మత్తు కలిగిద్దాం. అప్పుడు నీవు ఆయన పడక మీదికి వెళ్లి ఆయనతో లైంగికంగా కలిసికొనవచ్చు. ఈ విధంగా మన కుటుంబం అంతం కాకుండా పిల్లలు పుట్టేందుకు మనం మన తండ్రిని ఉపయోగించుకోవచ్చు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరునాడు అక్క తన చెల్లెలిని చూచి–నిన్నటి రాత్రి నా తండ్రితో నేనుశయ నించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మర్నాడు పెద్దకుమార్తె తన చెల్లెలితో, “నిన్న రాత్రి తండ్రితో పడుకున్నాను. ఈ రోజు మరలా అతడు ద్రాక్షరసం త్రాగేలా చేద్దాం, నీవు వెళ్లి అతనితో పడుకో, అలా మన తండ్రి ద్వారా మన కుటుంబ వంశావళిని కాపాడదాం” అని అన్నది.