Genesis 24:20 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తు కొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రిబ్కా వెంటనే తన కడవలోని నీళ్లన్నీ ఒంటెల కోసం అని చెప్పి నీళ్ల తొట్టిలో పోసింది. తర్వాత ఇంకా నీళ్లు తెచ్చేందుకు ఆమె బావి దగ్గరకు పరుగెత్తింది. ఆ ఒంటెలన్నింటికి ఆమె నీళ్లు పెట్టింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించితిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొనిపోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి ఆమె త్వరపడి తన కుండలో నీళ్లు తొట్టిలో పోసి, పరుగెత్తుకుంటూ మళ్ళీ బావి దగ్గరకు వెళ్లి, ఒంటెలన్నిటికి సరిపడే నీళ్లు చేది పోసింది.