Genesis 24:45 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకొనివచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడునాకు దాహమిమ్మని నేనామెను అడుగగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నేను ప్రార్థించటం ముగించక ముందే, నీళ్ల కోసం రిబ్కా బావి దగ్గరకు వచ్చింది. ఆమె తన నీళ్ల కడవ తన భుజం మీద పెట్టుకొంది. ఆమె వెళ్లి బావినుండి నీళ్లు తోడింది. ‘దయచేసి కొంచెం నీళ్లు ఇమ్మని’ నేను ఆమెతో అన్నాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపకముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకొనివచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడు–నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నేను నా హృదయంలో ఇంకా ప్రార్థన ముగించకముందే, రిబ్కా తన కుండను భుజంపై పెట్టుకుని రావడం నేను చూశాను. ఆమె బావిలోనికి దిగివెళ్లి నీళ్లు తోడుకున్న తర్వాత, ఆమెతో, ‘దయచేసి త్రాగడానికి నాకు నీళ్లు ఇవ్వు’ అని అడిగాను.