Genesis 29:32 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియు న్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లేయాకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె అతనికి రూబేను అని పేరు పెట్టింది. “నా కష్టాలను యెహోవా చూశాడు. నా భర్త నన్ను ప్రేమించటం లేదు. ఒకవేళ నా భర్త ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడేమో” అని లేయా అతనికి ఈ పేరు పెట్టింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లేయా గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “యెహోవా నా బాధను చూశారు. ఇప్పుడు తప్పకుండ నా భర్త నన్ను ప్రేమిస్తాడు” అని చెప్పి, అతనికి రూబేను అని పేరు పెట్టింది.