Genesis 31:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
లాబాను కుమారులుమన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఒక రోజున లాబాను కొడుకులు మాట్లాడుకోవడం యాకోబు విన్నాడు. “మన తండ్రికి ఉన్నదంతా యాకోబు తీసివేసుకొన్నాడు. యాకోబు ధనికుడైపోయాడు, ఈ ఐశ్వర్యం అంతా మన తండ్రి దగ్గర నుండి యాకోబు తీసుకున్నాడు.” అని వాళ్లు చెప్పుకొన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
లాబాను కుమారులు–మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
లాబాను కుమారులు, “యాకోబు మన తండ్రికి ఉన్న ఆస్తి అంతా తీసుకున్నాడు; అతడు సంపాదించుకున్న ఆస్తి అంతా మన తండ్రికి సంబంధించినదే” అని చెప్పుకోవడం యాకోబు విన్నాడు.