Genesis 31:53 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసె
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ ఒప్పందాన్ని గనుక మనం మీరితే, అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి పూర్వీకుల దేవుడు మనలను నేరస్థులుగా తీర్పు చెప్పును గాక.” యాకోబు తండ్రియైన ఇస్సాకు, దేవుణ్ణి “భయంకరుడు” అని పిల్చాడు. కనుక యాకోబు ఆ పేరు మీదనే వాగ్దానం చేశాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అబ్రాహాము దేవుడు నాహోరు దేవుడు వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రియైన ఇస్సాకు భయపడిన దేవునితోడని ప్రమాణము చేసెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అబ్రాహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చును గాక” అని అన్నాడు. కాబట్టి యాకోబు తన తండ్రి ఇస్సాకు భయపడే దేవుని నామంలో ప్రమాణం చేశాడు.