Genesis 34:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువు లతో పొలములలో నుండినందున వారు వచ్చువరకు ఊరకుండెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ యువకుడు తన కూతురికి చేసిన దుష్కార్యాన్ని గూర్చి యాకోబు విన్నాడు. అయితే యాకోబు కుమారులంతా పశువులతోబాటు పొలాల్లో ఉన్నారు. అందుచేత వాళ్లు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు యాకోబు ఏమీ చేయలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని, తన కుమారులు పశువులతో పొలములలోనుండినందునవారు వచ్చువరకు ఊరకుండెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యాకోబు తన కుమార్తెయైన దీనా మానభంగం చేయబడి అపవిత్రమైనది అని విన్నప్పుడు, అతని కుమారులు తన మందతో పొలంలో ఉన్నారు; కాబట్టి వారు ఇంటికి వచ్చేవరకు అతడు ఏమి చేయలేదు.