Genesis 38:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అందుకతడునేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపువరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యూదా, “నా మందలోనుంచి ఒక మేక పిల్లను పంపిస్తా” అని జవాబిచ్చాడు. “సరే, ఒప్పుకొంటాను. కాని నీవు ఆ మేక పిల్లను పంపించేంత వరకు నా దగ్గర ఉంచుకొనేందుకు నీవు యింకేమైన నాకు ఇవ్వాలి సుమా” అని జవాబు చెప్పింది ఆమె.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకతడు–నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె–అది పంపువరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు, “నా మంద నుండి మేకపిల్లను ఇస్తాను” అని చెప్పాడు. అప్పుడు ఆమె, “అది పంపే వరకు నా దగ్గర ఏదైనా తాకట్టు పెడతావా?” అని అడిగింది.