Genesis 38:29 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామెనీవేల భేదించుకొని వచ్చితివనెను. అందు చేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అయితే ఆ శిశువు తన చేయి లోపలకు లాగేసాడు. అప్పుడు మరో శిశువు ముందు పుట్టాడు. కనుక “మొత్తానికి నీవే ముందు భేదించుకొని పుట్టావన్న మాట” అంది మంత్రసాని. అంచేత వారు పెరెసు అని వానికి పేరు పెట్టారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామె–నీవేల భేదించుకొని వచ్చితివనెను. అందు చేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే ఆ శిశువు చేయి వెనుకకు తీసుకున్నప్పుడు, అతని సోదరుడు బయటకు వచ్చాడు, అప్పుడు ఆమె, “ఇలా నీవు దూసుకుని వచ్చావు!” అన్నది. అతనికి పెరెసు అని పేరు పెట్టారు.