Genesis 39:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అయితే అతడు ఒప్పకనా యజ మానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెనుగదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కానీ యోసేపు నిరాకరించాడు. అతడు చెప్పాడు: “నా యజమాని తన ఇంటిలో అన్ని విషయాల్లోనూ నన్ను నమ్మాడు. ఇక్కడ ఉన్న ప్రతిదాని గూర్చి అతడు నాకు బాధ్యత పెట్టాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే అతడు ఒప్పక–నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికప్పగించెనుగదా, నా వశమున తన యింటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు; ఈ యింటిలో నాకంటె పైవాడు ఎవడును లేడు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కానీ అతడు తిరస్కరించాడు. “నా యజమాని నన్ను అధికారిగా నియమించి ఇంట్లో నేనున్నాననే నమ్మకంతో తాను నిశ్చింతగా ఉన్నారు. తన సమస్తాన్ని నా పర్యవేక్షణలో ఉంచాడు.