Genesis 42:7 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడిమీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారుఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితి మనిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యోసేపు తన సోదరులను చూశాడు, వారెవరయిందీ అతనికి తెలుసు, కానీ యోసేపు వారిని ఎరుగనట్టే వారితో మాట్లాడాడు. అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. “ఎక్కడనుండి వచ్చారు మీరు?” అని అతడు అడిగాడు. ఆ సోదరులు “మేము కనాను దేశంనుండి వచ్చాం. ఆహారం కొనేందుకు మేము వచ్చాం” అని జవాబిచ్చారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపెట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి–మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు–ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితి మనిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యోసేపు వారిని చూసిన వెంటనే, వారిని గుర్తుపట్టాడు కాని తెలియనట్లుగా నటిస్తూ వారితో కఠినంగా మాట్లాడాడు. “మీరెక్కడ నుండి వచ్చారు?” అని అతడు అడిగాడు. వారు, “కనాను దేశం నుండి ఆహారం కొనడానికి వచ్చాం” అని జవాబిచ్చారు.