Genesis 43:21 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అయితే మేము దిగినచోటికి వచ్చి మా గోనెలను విప్పి నప్పుడు, ఇదిగో మా మా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో నుండెను. అవి చేతపట్టుకొని వచ్చితివిు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇంటికి వెళ్తూ మార్గంలో మేము మా సంచులు విప్పితే, మా ప్రతి ఒక్కరి సంచిలోనూ డబ్బు కనబడింది. ఆ డబ్బు అక్కడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు. అయితే ఆ డబ్బు మళ్లీ మీకు ఇచ్చేయాలని ఇప్పుడు మాతో తెచ్చాం. పైగా ఇప్పుడు మేము కొనాలనుకొంటున్న ధాన్యంకోసం ఇంకా ఎక్కువ మొత్తంకూడ మళ్లీ ఇప్పుడు తెచ్చాం.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే మేము దిగినచోటికి వచ్చి మా గోనెలను విప్పి నప్పుడు, ఇదిగో మా మా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో నుండెను. అవి చేతపట్టుకొని వచ్చితిమి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కానీ మేము రాత్రి గడిపిన స్థలంలో మా గోనెసంచులను విప్పి చూస్తే, ఎవరు ఎంత వెండి తెచ్చారో సరిగ్గా అంతే వెండి వారి గోనెసంచిలో ఉంది. కాబట్టి మేము తిరిగి దానిని తెచ్చాము.