Genesis 43:32 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరు వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు; అది ఐగుప్తీ యులకు హేయము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ సేవకులు యోసేపు ఒక్కడిని ఒక బల్ల దగ్గర వేరుగాను, సోదరులను మరో బల్ల దగ్గర వేరుగాను కూర్చుండబెట్టారు. వారితో భోంచేస్తున్న ఈజిప్టు వారిని వారి మట్టుకే ఒక బల్లదగ్గర కూర్చుండ బెట్టారు. ఈజిప్టువాళ్లు హీబ్రూవారితో కలిసి భోజనం చేయరు, అది ఈజిప్టు మత విరోధం.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతనికిని వారికిని అతనితో భోజనముచేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు; అది ఐగుప్తీయులకు హేయము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సేవకులు యోసేపుకు తన బల్ల దగ్గర, అతని సోదరులకు వేరే బల్ల దగ్గర, అతనితో భోజనంచేస్తున్న ఈజిప్టువారికి వరుసగా భోజనం వడ్డించారు, ఎందుకంటే హెబ్రీయులతో కలసి భోజనం చేయడం ఈజిప్టువారికి అసహ్యము.