Genesis 44:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకతడుమంచిది, మీరు చెప్పినట్టే కానీ యుడి; ఎవరియొద్ద అది దొరుకునో అతడే నాకు దాసు డగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మీరు చెప్పినట్లే చేద్దాం. కాని నేను మాత్రం ఎవర్నీ చంపను. వెండి పాత్ర గనుక నాకు కనబడితే ఆ మనిషి మాత్రం నాకు బానిస అవుతాడు. మిగిలిన వాళ్లు స్వేచ్ఛగా వెళ్లొచ్చు” అన్నాడు ఆ సేవకుడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకతడు–మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి; ఎవరియొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు అతడు, “సరే మీరన్నట్టే కానివ్వండి; ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడు నాకు బానిస అవుతాడు, మిగితా వారు నిర్దోషులవుతారు” అని అన్నాడు.