Habakkuk 3:6 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగు దురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరి గించువాడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా నిలుచుండి భూమికి తీర్పు తీర్చాడు. ఆయన అన్ని దేశాల ప్రజలవైవు చూశాడు. వారు భయంతో వణికి పోయారు. అనాదిగా పర్వతాలు బలంగా నిలిచి ఉన్నాయి. కాని ఆ పర్వతాలు బద్దలై పోయాయి. చాల పాత కొండలు పడిపోయాయి. దేవుడు ఎల్లప్పుడూ అలానే ఉంటాడు!
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగు దురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరి గించువాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన నిలబడగా భూమి కంపించింది; ఆయన చూడగా దేశాలు వణికాయి. పురాతన పర్వతాలు కూలిపోయాయి పురాతన కొండలు అణగిపోయాయి కానీ ఆయన మార్గాలు శాశ్వతమైనవి.