Haggai 2:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఒకడు ప్రతిష్టితమైన మాంస మును తన వస్త్రపుచెంగున కట్టుకొని, తన చెంగుతో రొట్టె నైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏవిధమగు భోజనపదార్థమునైనను ముట్టినయెడల, ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా? యని యాజకులనడుగగా వారు కాదనిరి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
‘ఒకడు తన వస్త్రముల మడతలో పవిత్ర బలి మాంసాన్ని పెట్టుకుని వెళ్లాడనుకో. పవిత్ర మాంసాన్ని ఉంచిన తన వస్త్రం రొట్టెనుగాని, వండిన ఆహారాన్నిగాని, ద్రాక్షారసం, నూనె లేక ఇతర తినుబండారాలనుగాని తాకిందనుకో. అలా ముట్టబడిన పదార్థం పవిత్రమౌతుందా?’ అని” యాజకులు “కాదు” అని సమాధానమిచ్చారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపుచెంగున కట్టుకొని, తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏవిధమగు భోజనపదార్థమునైనను ముట్టినయెడల, ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా? యని యాజకులనడుగగా వారు కాదనిరి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎవరైనా తమ వస్త్రపు చెంగులో ప్రతిష్ఠితమైన మాంసాన్ని తీసుకెళ్లి, ఆ చెంగుతో రొట్టెను గాని వంటకాన్ని గాని, ద్రాక్షరసాన్ని గాని, నూనెను గాని ఇతర ఏ ఆహారాన్ని గాని తాకితే అది పవిత్రం అవుతుందా?” అని అడిగితే, యాజకులు, “కాదు” అన్నారు.