Hebrews 1:13 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనినిగూర్చియైనయెప్పుడైనను చెప్పెనా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుడు ఏ దేవదూతతోనైనా: “నీ శత్రువుల్ని నీ పాద పీఠంగా చేసేవరకు నా కుడివైపు కూర్చో,” అని ఎన్నడైనా అన్నాడా?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అని చెప్పుచున్నాడు. అయితే –నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయువరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనినిగూర్చియైన యెప్పుడైనను చెప్పెనా?౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“నేను నీ శత్రువుల్ని నీ పాదాల కింద పీటగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో” అని దేవుడు తన దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేవుడు దేవదూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా, “నేను నీ శత్రువులను నీ పాదాలకు పాదపీఠంగా చేసే వరకు నా కుడి వైపున కూర్చో అని చెప్పారా”?