Hebrews 2:13 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు నే నాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మరొక చోట “నేను దేవుణ్ణి నమ్ముతున్నాను!” అంతేకాక ఇలా కూడా అన్నాడు: “నేను, దేవుడు నాకిచ్చిన సంతానం యిక్కడ ఉన్నాము!”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములుగలవారైనందున ఆప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను.౹
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఇంకా, “నేను ఆయనలో నమ్మకముంచుతాను” అన్నాడు. ఇంకా “చూడు. నేనూ, దేవుడు నాకిచ్చిన పిల్లలూ” అనీ అన్నాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అంతేకాక, “నేను ఆయనలో నా నమ్మకాన్ని ఉంచుతాను.” అంతేకాక, “ఇదిగో నేను, దేవుడు నాకిచ్చిన పిల్లలు,” అని ఆయన చెప్తున్నారు.