Hebrews 2:6 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ధర్మశాస్త్రంలో ఒకచోట ఈ విధంగా వ్రాయబడింది: “మానవుణ్ణి గురించి నీవాలోచించటానికి అతడెంతటివాడు? మానవ కుమారుణ్ణి నీవు చూడడానికి అతడెంతటివాడు?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు –నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దీనికి ప్రతిగా ఒక వ్యక్తి ఒక చోట సాక్షమిస్తూ ఇలా అన్నాడు. “నువ్వు తలచుకోడానికి నరుడు ఎంతటి వాడు? నువ్వు పట్టించుకోడానికి నరపుత్రుడెవడు?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే ఒకచోట ఒకరు ఇలా సాక్ష్యమిచ్చారు: “మీరు మానవాళిని లక్ష్యపెట్టడానికి వారు ఏపాటివారు? మీరు నరపుత్రుని గురించి శ్రద్ధ చూపడానికి అతడు ఎంతటివాడు?