Hosea 10:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది; అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును; ఎఫ్రాయిముచేత దున్నిం చుటకు నేనొకని నియమింతును, యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసికొనును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఎఫ్రాయిము నూర్పిడి కళ్లంలో ధాన్యం మీద నడవడానికి ఇష్టపడే శిక్షణగల పెయ్యలాగ ఉన్నాడు. దాని మెడమీద నేను ఒక కాడిని పెడతాను. తాళ్లను నేను ఎఫ్రాయిము మీద ఉంచుతాను. అప్పుడు యూదా దున్నటం మొదలు పెడతాడు. యాకోబు తానే భూమిని చదును చేస్తాడు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది; అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును; ఎఫ్రాయిముచేత దున్నిం చుటకు నేనొకని నియమింతును, యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసికొనును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎఫ్రాయిం శిక్షణ పొందిన పెయ్యలా ఉంది, నూర్పిడి అంటే దానికి ఇష్టం; కాబట్టి దాని నున్నటి మెడ మీద నేను కాడి పెడతాను, నేను ఎఫ్రాయిం మీద స్వారీ చేస్తాను, యూదా భూమిని దున్నాలి, యాకోబు భూమిని చదును చేయాలి.