Hosea 13:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నిజముగా ఎఫ్రాయిము తన సహోదరు లలో ఫలాభివృద్ధినొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువు లన్నిటిని శత్రువు కొల్లపెట్టును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలు తన సోదరుల మధ్య పెరుగుతాడు. కాని, శక్తివంతమైన తూర్పుగాలి వీస్తుంది. యెహోవా గాలి ఎడారినుంచి వస్తుంది. అప్పుడు (ఇశ్రాయేలు) బావి ఎండిపోతుంది. అతని నీటి బుగ్గ ఇంకిపోతుంది. (ఇశ్రాయేలు) సంపదలో విలువైన వాటన్నింటినీ గాలి ఎగరేసుకుపోతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధినొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించుగాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువు లన్నిటిని శత్రువు కొల్లపట్టును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను ఎఫ్రాయిం పట్ల దయ చూపించను. యెహోవా నుండి తూర్పు గాలి వస్తుంది, ఎడారి నుండి అది వీస్తుంది. అతని నీటిబుగ్గ ఎండిపోతుంది అతని బావి ఇంకిపోతుంది. అతని ధననిధులు, ప్రియమైన వస్తువులు దోచుకోబడతాయి.