Hosea 7:16 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వానియొద్దకు తిరుగరు; వారు అక్కరకురాని విల్లువలె నున్నారు; వారి యధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తి పాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తుదేశములో అపహాస్యము నొందుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దేవుళ్లు కానివారివైపు (బయలు దేవత) వారు తిరిగారు. వారు అక్కరకు రాని (వంగని) విల్లులా ఉన్నారు. వారి నాయకులు తమ బలాన్ని గూర్చి అతిశయించారు. కానీ వారు కత్తులతో చంపబడతారు. అప్పుడు ఈజిప్టు ప్రజలు వారిని చూచి నవ్వుతారు. విగ్రహారాధన నాశనానికి దారి తీస్తుంది.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వానియొద్దకు తిరుగరు; వారు అక్కరకురాని విల్లువలె నున్నారు; వారి యధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తిపాలగుదురు. ఈలాగునవారు ఐగుప్తుదేశములో అపహాస్యము నొందుదురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు సర్వోన్నతుని వైపు తిరుగరు, వారు పనికిరాని విల్లులా ఉన్నారు. వారి నాయకులు తమ గర్వపు మాటల వలన కత్తివేటుకు పడిపోతారు. ఇందుచేత ఈజిప్టు దేశంలో వారు ఎగతాళి చేయబడతారు.