Hosea 9:1 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలూ, రాజ్యాలు సంబరం చేసుకున్నట్టు నీవు చేసుకోవద్దు. సంతోషంగా ఉండకు! నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తించి, నీ దేవుణ్ణి విడిచిపెట్టేశావు. ప్రతి కళ్లం మీద నీవు నీ లైంగిక పాపం చేశావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమునుబట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇశ్రాయేలూ, ఆనందించకు; ఇతర దేశాల్లా ఉత్సాహపడకు. నీవు నీ దేవుని పట్ల నమ్మకంగా లేవు; ధాన్యం దుల్లగొట్టే నీ నూర్పిడి కళ్ళాలన్నిటిలో నీవు వేశ్యల జీతాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డావు.