Hosea 9:15 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది; అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలను బట్టి వారి నికను ప్రేమింపక నా మందిరములోనుండి వారిని వెలివేతును; వారి యధిపతులందరును తిరుగుబాటు చేయువారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారి దుర్మార్గం అంతా గిల్గాలులో ఉంది. అక్కడే నేను వారిని అసహ్యించుకోవటం మొదలు బెట్టాను. వారు చేసే దుర్మార్గపు పనుల మూలంగా వారిని నా ఇంటినుండి నేను వెళ్ల గొట్టేస్తాను. ఇంకెంతమాత్రం నేను వారిని ప్రేమించను. వారి నాయకులు తిరుగుబాటుదారులు. వారు నాకు విరోధంగా తిరిగారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది; అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలనుబట్టి వారి నికను ప్రేమింపక నా మందిరములోనుండి వారిని వెలివేతును; వారి యధిపతులందరును తిరుగుబాటు చేయువారు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“గిల్గాలులో వారి చెడుతనం అంతటిని బట్టి, అక్కడ వారిని ద్వేషిస్తున్నాను. వారు పాప క్రియలనుబట్టి, నేను వారిని నా మందిరంలో నుండి వెళ్లగొడతాను. నేను ఇక ఎన్నడూ వారిని ప్రేమించను; వారి నాయకులంతా తిరుగుబాటుదారులు.