Hosea 9:4 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెహోవాకు ద్రాక్షారస పానా ర్పణమును వారర్పింపరు వారర్పించు బలులయందు ఆయన కిష్టములేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలా పము చేయువారి ఆహారమువలెనగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికిరాదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలీయులు ద్రాక్షారసపు అర్పణలు యెహోవాకు అర్పించరు. వారు ఆయనకు జంతువుల బలులు అర్పించరు. వారి బలులు శవసంస్కారమువద్ద తినే భోజనము లాంటిది. ఎవరైతే దాన్ని తింటారో వారు అపరిశుద్ధులవుతారు. వారి రొట్టెలు యెహోవా ఆలయంలోనికి వెళ్లవు-అవి సరిగ్గా వారు బతికి ఉండేందుకు మాత్రమే సరిపోతాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవాకు ద్రాక్షారస పానా ర్పణమును వారర్పింపరు; వారర్పించు బలులయందు ఆయన కిష్టములేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలాపము చేయువారి ఆహారమువలెనగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికిరాదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు యెహోవాకు ద్రాక్షరస పానార్పణలు అర్పించరు, వారి బలులు ఆయనను సంతోషపరచవు. అట్టి బలులు ఏడ్చేవారి రొట్టెలా ఉంటాయి. వాటిని తినేవారందరు అపవిత్రులవుతారు. ఈ ఆహారం వారికే సరిపడుతుంది; అది యెహోవా మందిరంలోకి రాదు.