Isaiah 10:20 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ సమయంలో ఇశ్రాయేలులో ఇంకా బ్రతికి ఉన్నవారు, యాకోబు వంశ ప్రజలు, వారిని కొట్టేవాని మీద ఆధారపడరు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడైన యెహోవా మీద నిజంగా ఆధారపడటం వారు నేర్చుకొంటారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ రోజున ఇశ్రాయేలులో మిగిలినవారు యాకోబు కుటుంబంలో తప్పించుకున్నవారు తమను మొత్తిన వానిని ఇక ఆశ్రయించరు కాని ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను వారు నిజంగా ఆశ్రయిస్తారు.