Isaiah 14:9 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరినివారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీవు వస్తున్నందుకు, మరణస్థానమైన పాతాళం హర్షిస్తుంది. భూలోక నాయకులందరి ఆత్మలనూ పాతాళం నీ కోసం మేల్కొలుపుతుంది. పాతాళం, రాజులను వారి సింహాసనాల మీదనుండి లేపి నిలబెడుతుంది. నీ రాకకు వారు సిద్ధంగా ఉంటారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరిని వారి వారి సింహాసనములమీదనుండి లేపుచున్నది
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీవు వస్తుండగా నిన్ను కలుసుకోడానికి క్రింద పాతాళం నీ గురించి ఆవేశపడుతుంది; అది నిన్ను చూసి చచ్చిన వారి ఆత్మలను అనగా భూమి మీద నాయకులుగా ఉన్నవారందరిని రేపుతుంది; దేశాలకు రాజులుగా ఉన్నవారందరిని తమ సింహాసనాలు నుండి లేపుతుంది.