Isaiah 17:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించును వారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రజలు ఆ అలల్లా ఉంటారు. దేవుడు ఆ ప్రజలతో కఠినంగా మాట్లాడతాడు. వారు పారిపోతారు. ప్రజలు గాలికి కొట్టుకొని పొయ్యే పొట్టులా ఉంటారు. ప్రజలు తుఫానుకు కొట్టుకొని పొయ్యే కలుపు మొక్కల్లా ఉంటారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనములు విస్తారజలముల ఘోషవలె ఘోషించును ఆయన వారిని బెదరించునువారు దూరముగా పారిపోవుదురు కొండమీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుపాను ఎదుట గిరగిర తిరుగు కసవు ఎగిరిపోవునట్లువారును తరుమబడుదురు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఉప్పొంగుతున్న నీటిలా ప్రజలు గర్జించినా ఆయన వారిని బెదిరించగా, వారు దూరంగా పారిపోతారు. కొండల మీది పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు, సుడిగాలికి గిరగిరా తిరుగుతూ ఎగిరిపోయే పిచ్చిమొక్కలా తరమబడతారు.