Isaiah 20:2 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెనునీవు పోయి నీ నడుముమీది గోనెపట్ట విప్పి నీ పాదములనుండి జోళ్లు తీసివేయుము. అతడాలాగు చేసి దిగంబరియై జోళ్లు లేకయే నడచు చుండగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ సమయంలో ఆమోజు కుమారుడు యెషయా ద్వారా యెహోవా మాట్లాడాడు: “వెళ్లు, నీ నడుముకు కట్టిన దుఃఖవస్త్రం తీసివేయి. నీ పాదాల జోళ్లు తీసివేయి” అని యెహోవా చెప్పాడు. యెషయా యెహోవాకు విధేయుడయ్యాడు. మరియు యెషయా బట్టలు లేకుండా, చెప్పులు లేకుండా అక్కడ అంతా తిరిగాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఈలాగు సెలవిచ్చెను–నీవు పోయి నీ నడుముమీది గోనె పట్ట విప్పి నీ పాదములనుండి జోళ్లు తీసివేయుము. అతడాలాగు చేసి దిగంబరియై జోళ్లు లేకయే నడచుచుండగా
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ సమయంలో యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా మాట్లాడారు. ఆయన, “నీ నడుముకున్న గోనె పట్టాను, నీ పాదాలకున్న చెప్పులు తీసివేయి” అన్నారు. అతడు అలాగే చేసి, బట్టలు తీసివేసి చెప్పులు లేకుండా నడిచాడు.