Isaiah 23:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఇదిగో కల్దీయుల దేశమును చూడుము వారికను జన ముగా ఉండరు అష్షూరీయులు దానిని అడవిమృగములకు నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టి యున్నారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందుచేత తూరు ప్రజలు, “బబులోను ప్రజలు మాకు సహాయం చేస్తారు” అంటున్నారు. కానీ కల్దీయుల దేశం చూడండి. బబులోను ఇప్పుడు ఒక దేశం కాదు. బబులోను మీద అష్షూరు దాడి చేసి దాని చుట్టూ యుద్ధ గోపురాలు కట్టింది. అందమైన గృహాలనుండి సైన్యం సమస్తం దోచుకొంది. అష్షూరు బబులోనును అడవి మృగాలకు స్థావరంగా చేసింది బబులోనును వారు శిథిలాలుగా మార్చేశారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇదిగో కల్దీయుల దేశమును చూడుము వారికను జన ముగా ఉండరు అష్షూరీయులు దానిని అడవిమృగములకు నివాసముగా చేసియున్నారు.వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బబులోనీయుల దేశాన్ని చూడు, వారు తమ గుర్తింపును కోల్పోయారు! అష్షూరీయులు దానిని ఎడారి జీవులకు నివాసంగా చేశారు. వారు దానిలో ముట్టడి గోపురాలు కట్టించి, దాని కోటలు పడగొట్టి శిథిలాలుగా మార్చారు.