Isaiah 28:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు నేల సదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ చల్లును తెల్ల జీలకఱ్ఱ చల్లును గోధుమలు వరుసగా విత్తును యవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మిరపమొలకలు వేయును గదా?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రైతు భూమిని సిద్ధంచేసి, విత్తనాలు వేస్తాడు. వేర్వేరు విత్తనాలను వేర్వేరు పద్ధతుల్లో వేస్తాడు. నల్ల జీలకర్ర విత్తనాలు వెదజల్లుతాడు. తెల్ల జీలకర్ర విత్తనాలను నేలమీద చెల్లుతాడు. గోధుమలను వరుస క్రమంలో నాటుతాడు. యవలను దాని ప్రత్యేక స్థలంలో నాటుతాడు, మిరప మొలకలను తన పొలంగట్ల మీద నాటుతాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు నేల చదునుచేసిన తరువాత నల్ల జీలకఱ్ఱ చల్లును తెల్ల జీలకఱ్ఱ చల్లును గోధుమలు వరుసగా విత్తును యవలను తానేర్పరచిన చేనిలో చల్లును దాని అంచున మెరపమొలకలు వేయును గదా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు నేల చదును చేసిన తర్వాత సోంపు, జీలకర్ర విత్తనాలు చల్లడా? గోధుమలను వాటి స్థలంలో నాటడా? యవలను వాటి చోట వేయడా? పొలం అంచుల్లో ధాన్యం నాటడా?