Isaiah 37:17 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
సైన్యముల కధిపతివగు యెహోవా, చెవి యొగ్గి ఆలకిం చుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నా ప్రార్థన ఆలకించు! నీ నేత్రాలు తెరచి, సన్హెరీబు పంపిన ఈ వార్త చూడు. సన్హెరీబు నాకు ఈ సందేశం పంపించాడు జీవముగల దేవుడవైన నిన్ను గూర్చి చెడు విషయాలను ఈ సందేశం చెబుతోంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సైన్యములకధిపతివగు యెహోవా, చెవి యొగ్గి ఆలకించుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా, శ్రద్ధగా వినండి; యెహోవా, కళ్లు తెరచి చూడండి. జీవంగల దేవున్ని దూషించడానికి సన్హెరీబు చెప్పి పంపిన మాటలన్నిటిని వినండి.