Isaiah 37:26 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బ లుగా చేయుట నా వలననే సంభవించినది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“‘అని నీవు చెప్పావు. అయితే నేను చెప్పినది నీవు వినలేదా? అష్షూరు రాజా, దేవుడనైన నేనే ఆ సంగతులను చేశానని నిశ్చయంగా నీవు ఎప్పుడో విన్నావు. చాలాకాలం క్రిందట నేను అష్షూరును చేశాను. ఇప్పుడు నిన్ను ఇక్కడికి నేనే తీసుకొని వచ్చాను. మిగిలిన ఇతర పట్టణాలను నిన్ను నాశనం చేయనిచ్చాను. నా పనిలో నేనే నిన్ను వాడుకొని, ఆ పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేశాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బ లుగా చేయుట నా వలననే సంభవించినది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“చాలా కాలం క్రితం నేనే నిర్ణయించానని, నీవు వినలేదా? పూర్వకాలంలో నేను సంకల్పించాను. ఇప్పుడు నేను అలా జరిగేలా చేశాను, నీవు కోటగోడలు గల పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేసేలా చేశాను.